తెలంగాణ ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ | TSRTC Recruitment 2024
TSRTC Recruitment 2024: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో 3,000 ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ రూపొందించినట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో 3,000 ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ రూపొందించినట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం కరీంనగర్-2 డిపో ప్రాంగణంలో కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ రీజియన్ల పరిధికి సంబంధించి కారుణ్య నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో 43 వేల మంది పని చేస్తున్నారని, పదేళ్లుగా కొత్త ఉద్యోగాలు భర్తీ చేయలేదని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కొత్తగా 3,000 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు కండక్టర్, డ్రైవర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
✅అతి తక్కువ ధరలో “TSPSC Group-2,3,4; TS SI/Constable, RPF Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి