December 20, 2024
Police/Defence

TS Home Guard Jobs: తెలంగాణలో హోంగార్డు ఉద్యోగాల భర్తీ

TS Home Guard Jobs: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో హోంగార్డు ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

Download Our App

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో హోంగార్డు ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీసు శాఖలో నియామకాలపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీసు శాఖలో మరింత సమర్థవంతంగా సేవలు ఉపయోగించుకునేందుకు వెంటనే హోంగార్డుల నియామకాలను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు హోంగార్డుల సేవలను మరింత విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు. ఉద్యోగ నియామకాలను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చేపట్టాలని సీఎం ఆదేశించారు. నియామకాల ప్రక్రియలో ఉన్న లోటు పాట్లు, వాటిని అధిగమించే అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను కోరారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఉద్యోగ నియామకాలపైనా నివేదిక ఇవ్వాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా పోలీస్ ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

Download Our App

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!