TSPSC Group 2 | గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై తాజా సమాచారం
TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక మరోసారి వాయిదా పడతాయా? ఈ విషయమై గ్రూప్-2 అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది.
✅అతి తక్కువ ధరలో “TS గ్రూప్-2,3,4; ఎస్సై కానిస్టేబుల్, SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక మరోసారి వాయిదా పడతాయా? ఈ విషయమై గ్రూప్-2 అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ.. 2024 జనవరిలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు పరిపాలన పరమైన ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష కేంద్రాలు గుర్తించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది.
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 తో పాటు ఇతర నియామక పరీక్షల తాజా పరిస్థితిపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం వివరాలు తీసుకున్నట్లు సమాచారం. వచ్చే వారం లోపు సమీక్ష నిర్వహించి.. ఈ సమీక్షలో గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
✅అతి తక్కువ ధరలో “TS గ్రూప్-2,3,4; ఎస్సై కానిస్టేబుల్, SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి