AP Government Jobs: 10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ.. ఆఫీస్ సబార్డినేట్, అటెండర్ పోస్టులు
AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో 10th క్లాస్ అర్హతతో ఆఫీస్ సబార్డినేట్, అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయనగరం జిల్లాలోని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS) అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆడియో మెట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10th క్లాస్, బీఎస్సీ(ఆడియాలజీ) అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
1.ఆడియో మెట్రీషియన్: 2 పోస్టులు
2.జనరల్ డ్యూటీ అటెండెంట్: 05 పోస్టులు
3.ఆఫీస్ సబార్డినేట్: 1 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 8.
విద్యార్హతలు:
1.ఆడియో మెట్రీషియన్: బీఎస్సీ(ఆడియాలజీ)
2.జనరల్ డ్యూటీ అటెండెంట్: 10th క్లాస్
3.ఆఫీస్ సబార్డినేట్: 10th క్లాస్
వయోపరిమితి:
2023 జూలై 1వ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
1.ఆడియో మెట్రీషియన్: రూ.18,500/-
2.జనరల్ డ్యూటీ అటెండెంట్: రూ.15,000/-
3.ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000/-
ఎంపిక విధానం:
అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్,
డిస్ట్రిక్ట్ హాస్పిటల్,
విజయనగరం కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 అక్టోబర్ 25వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.