TS Government Jobs: తెలంగాణ విద్యుత్ శాఖలో 400 ఉద్యోగాలు భర్తీ.. అర్హత, వయస్సు, ఎంపిక విధానం వివరాలు
TS Genco Recruitment 2023: తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TS GENCO) త్వరలో 400 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.
TS Genco Recruitment 2023: తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TS GENCO) త్వరలో 400 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. వీటిలో 350 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 50 కెమిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణ అవసరాలకు అవసరమైన ఉద్యోగులను భర్తీ చేసుకోవాలని సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య, నోటిఫికేషన్ ప్రకటనపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాబోయే రెండు నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. AE పోస్టులకు B.Tech/ BE (ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్) విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కెమిస్ట్ పోస్టులకు ఎంఎస్సీ కెమిస్ట్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి