AP Government Jobs: పౌరసరఫరాల శాఖలో 951 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మచిలీపట్నం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కృష్ణ జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.టెక్నికల్ అసిస్టెంట్: 317 పోస్టులు
2.డేటా ఎంట్రీ ఆపరేటర్: 317 పోస్టులు
3.హెల్పర్: 317 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 951.
విద్యార్హతలు:
1.టెక్నికల్ అసిస్టెంట్: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడీసీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
2.డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
3.హెల్పర్: 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి:
టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు 21 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు;
హెల్పర్ పోస్టులకు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
అకడమిక్ మార్కులు, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్,
ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్,
హంన రెసిడెన్సీ,
D.No.20-132/B,
ZP సెంటర్, కొబ్బరితోట,
మచిలీపట్నం,
కృష్ణ జిల్లా – 521001.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 సెప్టెంబర్ 14వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.