AP Government Jobs: విద్యుత్ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖకు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (AP Genco) నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 26 మేనేజ్మెంట్ ట్రైనీ (కెమికల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు పొందే అభ్యర్థులు ఏపీ జెన్కో పరిధిలోని పవర్ ప్లాంట్ నందు పని చేయవలసి ఉంటుంది. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
పోస్టుల వివరాలు:
మేనేజ్మెంట్ ట్రైనీ (కెమికల్): 26 పోస్టులు
విద్యార్హతలు:
ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 ఆగస్టు 31వ తారీకు నాటికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
నెలకు రూ.25,000/-
ఎంపిక విధానం:
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 సెప్టెంబర్ 21వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
హార్డ్ కాపీ పంపవలసిన చిరునామా:
The Chief General Manager (Adm.,IS&ERP),
3rd Floor,
Vidyut Soudha,
AP GENCO,
Vijayawada – 520004.
హార్డ్ కాపీ పంపవలసిన చివరి తేదీ:
2023 సెప్టెంబర్ 30వ తారీకు లోపు హార్డ్ కాపీ పంపాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి