APPSC | త్వరలో గ్రూప్-1, గ్రూప్-2, JL, DL నోటిఫికేషన్లు.. మొత్తం 4,539 పోస్టుల భర్తీ
APPSC Group-1, Group-2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
APPSC Group-1, Group-2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్-1 కింద 100 పోస్టులు, గ్రూప్-2 కింద 1,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులే కాకుండా డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు (డీఈవో), ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్లు, లైబ్రేరియన్లు తదితరాలు కలిపి 1,199 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. వీటితోపాటు 2020 అసిస్టెంట్ ప్రొఫెసర్, 220 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వనున్నామని వెల్లడించారు. మొత్తంగా రానున్న రోజుల్లో ఏపీపీఎస్సీ ద్వారా 4500 కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గ్రూప్-2 పరీక్షల సిలబస్, పరీక్ష విధానంలోనూ మార్పులు చేస్తున్నామన్నారు. గ్రూప్-2లో గతంలో మూడు పేపర్లుండగా ఇప్పుడు రెండు పేపర్లుగా మార్చామని తెలిపారు. కొత్త నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు విజయం సాధించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.