APPSC: ఏపీపీఎస్సీ ద్వారా 3,295 ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్.. ఆగస్టు 23 న నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఇందులో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు భర్తీ చేయనున్నారు. నవంబరు 15 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నూటికి నూరు శాతం మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు.
యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై షెడ్యూల్, పరీక్షా విధానంపై సీఎంకు అధికారులు వివరించారు. ఆగస్టు 23న యూనివర్సిటీల్లో 2,635 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. సెప్టెంబరు 3, 4 వారాల్లో ఏపీపీఎస్సీ ద్వారా ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అక్టోబరు 10వ తారీకు లోపు పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసిన అనంతరం నెల రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నవంబరు 15 నాటికి ఇంటర్వ్యూలు సహా నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.