TSPSC Group-3: బిగ్ అలెర్ట్.. గ్రూప్-3 పరీక్ష ఎప్పుడంటే?
TSPSC Group-3: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 రాతపరీక్షను అక్టోబర్ నెలలో నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే గ్రూప్-3 రాతపరీక్ష షెడ్యూల్ ను ప్రకటించనుంది.
గ్రూప్-3 పరీక్షలు రెండ్రోజుల పాటు మూడు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గ్రూప్-2 పరీక్ష రాస్తున్న చాలా మంది అభ్యర్థులు గ్రూప్-3కి కూడా ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్-2 ఎగ్జామ్ ఆగస్టు నెలాఖరులో ఉండటంతో, వారికీ కొంత ప్రిపరేషన్ కు టైమ్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. కనీసం నెలన్నర నుంచి రెండు నెలల గడువు ఇవ్వాలనుకుంటున్నది. అందుకే, అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారంలో గ్రూప్-3 నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నది. అయితే, అక్టోబర్ మొదటి, రెండు వారాల్లో యూపీఎస్సీ, బ్యాంక్, రైల్వేతో పాటు ఇతర నేషనల్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా అనే వివరాలను టీఎస్పీఎస్సీ సేకరిస్తున్నది. ఒకవేళ ఈ తేదీల్లో సాధ్యంకాకపోతే స్కూల్స్ కు దసరా సెలవులు ఇచ్చిన టైంలో పెట్టే యోచనలో అధికారులున్నారు.
వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 3 పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్-2లో హిస్టరీ, పాలిటి మరియు సొసైటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్-3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కోమార్కు. మూడు పేపర్లలో కలిపి 450 మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రూప్-3 ఉద్యోగాలకు భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 387 మంది పోటీ పడుతున్నారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-3 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి