TS Government Jobs: తెలంగాణలో 1,654 గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం నుంచి గెస్ట్ లెక్చరర్ల ఎంపిక ప్రారంభంకానున్నది.
ఎంపిక విధానం ఇలా:
1).19వ తేదీలోపు కళాశాలలు, సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలతో పత్రిక ప్రకటనను విడుదల చేస్తారు.
2).24వ తేదీ వరకు అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
3).26వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు.
4).27న సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితాను సెలక్షన్ కమిటీకి అధికారులు అప్పగిస్తారు.
5).28న ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు.
6).ఆగస్టు 1న ఎంపికైన అభ్యర్థులు కళాశాల ప్రిన్సిపాల్ కు రిపోర్టు చేయాలి.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు డీఈవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ప్రిన్సిపాలతో కూడిన త్రిసభ్య కమిటీ గెస్ట్ లెక్చరర్ల ఎంపిక చేపడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన వారి సేవలను 2024 ఏప్రిల్ వరకు వినియోగించుకొంటారు. వీరికి ఒక్కో పీరియడ్ నిమిత్తం రూ.390 చెల్లిస్తారు. నెలకు 72 పీరియడ్లకు మాత్రమే అనుమతిస్తారు. దీంతో వారికి రూ.28,080 చొప్పున వేతనం అందుతుంది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి