TS Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో 2,858 అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టుల భర్తీకి గానూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో కాంట్రాక్ట్ పద్ధతిన 527 మంది లెక్చరర్లను, 341 మందిని అవుట్సోర్సింగ్ పద్ధతిన, 50 మంది టీఎస్కేసీ ఫుల్ టైమ్ మెంటర్లను హోనరేరియం కింద, 1940 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల కాలపరిమితి 2024, మార్చి 31తో ముగియనుంది. త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు:
లెక్చరర్ పోస్టులు – 527
గెస్ట్ ఫ్యాకల్టీ – 1,940
సీనియర్ అసిస్టెంట్ – 29
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 31
స్టోర్ కీపర్ – 40
జూనియర్ స్టెనో – 01
రికార్డు అసిస్టెంట్ – 38
మ్యూజియం కీపర్ – 07
హెర్బేరియం కీపర్ – 30
మెకానిక్ – 08
ఆఫీసు సబార్డినేట్ – 157
టీఎస్కేసీ ఫుల్ టైమ్ మెంటర్లు – 50
మొత్తం పోస్టులు: 2,858
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి