AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ, బీఈ, బీటెక్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం వివరాలను తెలుసుకుందాం…
పోస్టుల వివరాలు:
1.సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 02 పోస్టులు
2.కంప్యూటర్ ఆపరేటర్: 05 పోస్టులు
3.డేటా ఎంట్రీ ఆపరేటర్ : 06 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 14.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి బీఈ, బీటెక్(CSE/ IT/ ECE), డిగ్రీ (కంప్యూటర్స్), ఏదైనా డిగ్రీతో పాటు PGDCA/ DCA ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
2022 జులై ఒకటవ తేదీ నాటికి 18 నుంచి 42 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు :
1.సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: రూ.31,500;
2.కంప్యూటర్ ఆపరేటర్: రూ.21,500;
3.డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.18,500.
ఎంపిక ప్రక్రియ:
విద్యా అర్హతలో సాధించిన మార్కులు, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు/ పరీక్ష ఫీజు:
రూ.500 ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:
2023 జూన్ 27వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రాథమిక మెరిట్ జాబితా వెల్లడి:
2023 జూలై 5వ తారీఖున ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
తుది మెరిట్ జాబితా వెల్లడి:
2023 జూలై 13 వ తారీకున తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి