TSPSC: జూనియర్ లెక్చరర్, అకౌంట్స్ ఆఫీసర్ రాతపరీక్ష తేదీలు విడుదల..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC మరో రెండు రాతపరీక్షల తేదీలు ప్రకటించింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో జూనియర్ లెక్చరర్ పోస్టులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను ప్రకటించింది. జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలను సెప్టెంబర్ 12వ తారీకు నుంచి అక్టోబర్ 3వ తారీకు వరకు నిర్వహించనుంది. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు సంబంధించిన రాతపరీక్షలను ఆగస్టు 8వ తారీఖున నిర్వహించనుంది. అభ్యర్థులు రాత పరీక్షలకు ఒక వారం ముందు నుంచి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి రాత పరీక్షల తేదీలు తెలుసుకోండి
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రాత పరీక్షల తేదీల కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కొరకు టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి