AP Govt Jobs: రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు ఏప్రిల్ 26 బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడవ తరగతి విద్యార్హత కలిగి ఉండాలి. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
ఆఫీస్ సబార్డినేట్: 8 పోస్టులు
ఎస్సీ మహిళ- 1
ఓసీ మహిళ- 1
ఎస్సీ జనరల్- 1
బీసీ-ఏ మహిళ- 1
ఎస్టీ మహిళ- 1
బధిర మహిళ- 1
ఓసీ కేటగిరిలో- 2
విద్యార్హత:
ఏడవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC అభ్యర్థులకు ఐదేళ్లు, విభిన్న ప్రతిభావంతులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
2023 మే 6వ తారీకు సాయంత్రం 5 గంటల లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
కలెక్టర్ కార్యాలయం, బాపు మ్యూజియం ప్రక్కన, మహాత్మా గాంధీ రోడ్డు, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.
ఈ అడ్రస్ కు అభ్యర్థులు తమ బయోడేటా, అర్హతకు సంబంధించిన పత్రాలను జత చేసి రిజిస్టర్ పోస్టు ద్వారా పంపవలెను.
ఈ ఉద్యోగాలకు సంబంధించి పత్రికా ముఖంగా వచ్చిన వివరాలను తెలుసుకోండి👇