TSLPRB: కానిస్టేబుల్ మెయిన్స్ హాల్ టికెట్స్ విడుదల.. హాల్ టికెట్ ఏ సైజులో, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే?
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లను తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) వెబ్ సైట్ లో విడుదల చేశారు. ఏప్రిల్ 24 ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 28 అర్ధరాత్రి 12.00 గంటల లోపు www.tslprb.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్ టికెట్ ను A4 సైజు పేపర్ పై ప్రింట్ అవుట్ తీసుకోవాలి. తర్వాత హాల్ టికెట్ పై కేటాయించిన చోట పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగా అతికించాలి. హాల్ టికెట్ పై ఫోటో లేని అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పోలీస్ కానిస్టేబుల్ (Civil, IT & CO) తుది రాత పరీక్షలు ఏప్రిల్ 30న జరగనున్నాయి. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 వరకు పరీక్ష నిర్వహిస్తారు. కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు