TS Constable Mains 2023: ఏప్రిల్ 30న కానిస్టేబుల్ తుది రాతపరీక్ష… జూన్ నెలలో ఫలితాలు
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ తుది రాత పరీక్షలను ఏప్రిల్ 30న నిర్వహించేందుకు రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 30న పరీక్షలు నిర్వహించి, జూన్ మొదటి వారంలో ఫలితాలు వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అనంతరం అభ్యంతరాల నమోదుకు అవకాశం ఇస్తారు. రాత పరీక్షల అనంతరం పరీక్ష పత్రాల మూల్యాంకనానికి చర్యలు తీసుకుంటారు. భారీ స్థాయిలో పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండటంతో అందుకు ‘మే’ నెలంతా సమయం పడుతుందని భావిస్తున్నారు. కొంత సమయం ఎక్కువైనా సరే పక్కాగా మూల్యాంకనం చేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రక్రియ అంతా ముగించుకొని జూన్ మొదటి వారంలో కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలు వెలువరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జూన్ నెలలో పరిశీలించనున్నారు.
ప్రతిరోజూ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం క్రింది టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి