4,020 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ గురుకులాల్లో 4,020 టీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ సాంఘిక సంక్షేమం, తెలంగాణ గిరిజన సంక్షేమం, మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమం, తెలంగాణ మైనార్టీ సంక్షేమం, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో పర్మినెంట్ ప్రాతిపదికన 4,020 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ నుంచి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2023 ఏప్రిల్ 28వ తారీకు నుంచి 2023 మే 27వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT): 4,020 పోస్టులు
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు:
- తెలుగు: 488 పోస్టులు
- సంస్కృతం: 25 పోస్టులు
- ఉర్దూ: 120 పోస్టులు
- హిందీ: 516 పోస్టులు
- ఇంగ్లీష్: 681 పోస్టులు
- మ్యాథమెటిక్స్: 741 పోస్టులు
- ఫిజికల్ సైన్స్: 431 పోస్టులు
- బయోలాజికల్ సైన్స్: 327 పోస్టులు
- జనరల్ సైన్స్: 98 పోస్టులు
- సోషల్ స్టడీస్: 579 పోస్టులు
విద్యార్హతలు:
సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ, టెట్ (State or Central) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
నెలకు రూ.42,300/- నుంచి రూ.1,15,270/- వరకు
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 ఏప్రిల్ 28వ తారీకు నుంచి 2023 మే 27వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజర్వేషన్ల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలు, వయోపరిమితి, విద్యార్హత, ఎంపిక విధానం వివరాల కొరకు పూర్తిస్థాయి నోటిఫికేషన్లో చూడండి. పూర్తి నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన రోజు (28/04/2023) నుంచి TREIRB అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి