APPSC: ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో 243 పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని 243 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. సూపర్వైజర్ గ్రేడ్-1 పోస్టులు 161, శిశు సంరక్షణ కేంద్రాల్లో సూపరింటెండెంట్ పోస్టులు 21, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో)/ అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏసీడీపీవో)/ మహిళా శిశు సంక్షేమ అధికారి రీజనల్ మేనేజర్ పోస్టులు 61. మొత్తం 243 పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.