10th క్లాస్ అర్హతతో 12,523 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు
10th క్లాస్ అర్హతతో 12,523 ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాల దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఫిబ్రవరి 24 రాత్రి 12 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 12,523 ఎంటీఎస్ మరియు హవాల్దార్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసైతే చాలు. తెలుగులో కూడా రాతపరీక్ష ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ssc.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
MTS: 11,994 పోస్టులు
హవాల్దార్: 529
మొత్తం: 12,523 పోస్టులు
దరఖాస్తు విధానం:
2023 జనవరి 18 నుండి 2023 ఫిబ్రవరి 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ssc.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
10th క్లాస్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి:
2023 జనవరి 1 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు, BC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు/పరీక్ష ఫీజు:
OC, BC, EWS అభ్యర్థులు: రూ.100/-
SC, ST & మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు
ఎంపిక విధానం:
MTS పోస్టులు: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
హవాల్దార్ పోస్టులు: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ & ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
ఒకే పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 90 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 270 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలో కూడా పరీక్ష ఉంటుంది. 2023 ఏప్రిల్ నెలలో పరీక్ష నిర్వహిస్తారు.
ఫిజికల్ టెస్ట్ వివరాలు:
Male: హైట్- 157.5 cms
చెస్ట్- 81 cms ( ఊపిరి పిలిచినప్పుడు కనీసం ఐదు సెంటీమీటర్లు పెరగాలి)
Female: హైట్- 152 cms
వెయిట్- 48 kgs
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు