ఆంధ్రప్రదేశ్ జైళ్ల శఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు జిల్లాలోని జిల్లా జైలు ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఫార్మాసిస్ట్ గ్రేడ్-2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత గల అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 01 పోస్టు
2.ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 01 పోస్టు
3.మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 01 పోస్టు
విద్యార్హతలు:
పదో తరగతి, బీఫార్మసీ, డీఫార్మసీ, DMLT ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
18 నుంచి 42 సంవత్సరాలలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
1.ఫార్మసిస్ట్ గ్రేడ్-2: రూ.17,500/-
2.ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: రూ.17,500/-
3.మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: రూ.12,000/-
ఎంపిక విధానం:
విద్యార్హతలో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
సూపరింటెండెంట్ కార్యాలయం, జిల్లా జైలు, గుంటూరు- 522002. చిరునామాకు దరఖాస్తులు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
16-02-2023 సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు