SSC: కానిస్టేబుల్ (GD) రాష్ట్రాల వారీగా ఖాళీలు విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 3,439 పోస్టులు..
కానిస్టేబుల్ GD ఖాళీల వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఏ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఏ కేటగిరి అభ్యర్థులకు ఎన్ని పోస్టులను రిజర్వ్ చేశారు అనే పూర్తి సమాచారాన్ని విడుదల చేసింది. SSC కానిస్టేబుల్ GD నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 46,435 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో 3,439 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,228 పోస్టులు, తెలంగాణ రాష్ట్రంలో 1,211 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF మరియు NCB విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు