AP పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చిందంటే?..క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఈరోజు పూర్తి అయ్యింది. ప్రశ్నపత్రం యావరేజ్ గా వచ్చిందని చాలామంది అభ్యర్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటి & కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు సులభంగా వచ్చాయి. ఎకానమీ, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ & ఇంగ్లీష్ సంబంధించిన ప్రశ్నలు యావరేజ్ గా వచ్చాయి. మొత్తంగా చూసుకుంటే ప్రశ్నపత్రం యావరేజ్ గా వచ్చిందని చెప్పుకోవచ్చు. కొంత కష్టపడి చదివిన అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష సులభంగానే క్వాలిఫై అవుతారు. ప్రిలిమినరీ పరీక్షలో పాసైన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు నిర్వహిస్తారు.
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ప్రిలిమినరీ ‘కీ’ ని త్వరలోనే పోలీసు నియామక మండలి వెబ్సైట్లో విడుదల చేస్తారు. www.slprb.ap.gov.in వెబ్ సైట్ లో విడుదల చేస్తారు.
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై కావాలంటే ఎవరికి ఎన్ని మార్కులు రావాలంటే
OC అభ్యర్థులు: 80 మార్కులు
BC అభ్యర్థులు: 70 మార్కులు
SC/ST అభ్యర్థులు: 60 మార్కులు
క్రింది లింక్ పై క్లిక్ చేసి ప్రశ్నపత్రం డౌన్లోడ్ చేసుకోండి