AP Police Jobs: ఒక్కో పోస్టుకు 421 మంది పోటీ..ముగిసిన దరఖాస్తు ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 411 ఎస్సై పోస్టులకు 1,73,047 మంది అభ్యర్థులు దర ఖాస్తు చేసుకున్నారు. సగటున ఒక్కో పోస్టుకు 421 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 411 ఎస్సై పోస్టుల భర్తీకి రాష్ట్ర పోలీసు నియామక మండలి ఇటీవల నోటిఫి కేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 315 సివిల్ ఎస్సై (పురుషులు, మహిళలు) పోస్టులు, 96 ఏపీఎస్పీ ఎస్సై (పురుష) పోస్టులకు దరఖాస్తు గడువు బుధవారం సాయంత్రం ముగిసింది. సివిల్, ఏపీఎస్పీ ఎస్సై పోస్టులకు మొత్తం 1,73,047 దరఖాస్తులు రాగా.. పురుష అభ్యర్థులు 1,40,453 మంది, మహిళా అభ్యర్థులు 32,594 మంది దరఖాస్తు చేశారు.
అప్లికేషన్ ఫామ్ లో ఎవరైనా తప్పులు చేసి ఉంటే 2023 జనవరి 22 ఉదయం 10 గంటల నుండి 2023 జనవరి 26 సాయంత్రం ఐదు గంటల వరకు పోలీస్ నియామక మండలి వెబ్సైట్ లో ఎడిట్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలినరీ పరీక్షను 2023 ఫిబ్రవరి 19వ తారీఖున నిర్వహిస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి