AP గ్రామ సచివాలయం 3వ నోటిఫికేషన్ 2023 | 14,523 పోస్టులు, ఏప్రిల్ లో పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం మూడో విడత నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 20 కేటగిరీలో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేస్తారని తెలుస్తోంది.
ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి, ఏప్రిల్ లోపే రాత పరీక్షలు కూడా నిర్వహించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. ఈసారి కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే రాత పరీక్షలతో సహా మొత్తం భర్తీ ప్రక్రియను చేపడతారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ గత సోమవారం పంచాయతీరాజ్ శాఖకు లేఖ కూడా రాసింది. మొత్తం మూడు నెలల వ్యవధిలోనే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
20 విభాగాల్లోని ఖాళీ పోస్టుల వివరాలను క్రింది పట్టికలో చూడగలరు