January 3, 2025
Uncategorized

TS ఎస్సై కానిస్టేబుల్ మెయిన్స్ క్వాలిఫై మార్కులు, నెగెటివ్ మార్కులపై స్పష్టతనిచ్చిన TSLPRB

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలను 2023 మార్చి 12వ తారీకు నుంచి ఏప్రిల్ 23వ తారీకు వరకు నిర్వహించనున్నట్లు TSLPRB తెలిపింది. ప్రిలిమినరీ రాతపరీక్షలో వలే అర్హత మార్కులను తగ్గించే అవకాశాలున్నాయా? అనే సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. గతంలో జన రల్ అభ్యర్థులకు 80, బీసీలకు 70, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 60 మార్కులు అర్హతగా ఉండేవి. అయితే ప్రస్తుత నోటిఫికేషన్లో మాత్రం ప్రిలిమినరీ రాతపరీక్ష అర్హత మార్కుల్ని అన్ని వర్గాల అభ్యర్థు లకూ 60 మార్కులుగానే నిర్ణయించారు. ప్రాథమిక రాతపరీక్ష ఫలితాలు వెల్లడించే తరుణంలో దీనిపై ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు కటాఫ్ మార్కుల్లో మార్పులు చేశారు. జనరల్ అభ్యర్థులకు 60, బీసీ అభ్య ర్థులకు 50, ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 40 మార్కుల్ని కటాఫ్ గా ఖరారు చేసి ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాల్ని ప్రకటించారు. ఈక్రమంలో తుది రాతపరీక్ష లోనూ కటాఫ్ మార్కులు తగ్గింపుపై ఊహాగానాలు వెలు వడ్డాయి. కానీ అందుకు అవకాశం లేదని నియామక మండలి స్పష్టం చేసింది.
కేటగిరీల వారీగా అర్హత మార్కులు
జనరల్ అభ్యర్థులు 80 మార్కులు, బీసీ అభ్య ర్థులు 70 మార్కులు, ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులు 60 మార్కులు సాధిస్తేనే అర్హత సాధిస్తారని TSLPRB తెలిపినట్లు సమాచారం. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మెరిట్లో ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
నెగిటివ్ మార్కులు ఉండవు
ప్రిలిమినరీ రాతపరీక్షలో 5 తప్పు సమాధానాలకు ఒక మార్కును తగ్గించిన సంగతి తెలిసిందే. కానీ మెయిన్స్ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ప్రశ్నపత్రాలు బహుళైచ్ఛిక సమాధానాలతో కూడినవే కావడంతో మండలి ఈ నిర్ణయం తీసుకుంది. అటు ప్రిలిమినరీ రాతపరీక్షలో నెగెటివ్ మార్కుల విధానంలో నెగ్గి, ఇటు శారీరక సామర్థ్య పరీక్షల్లోనూ అర్హత సాధించగలిగితే సత్తా ఉన్నట్లుగా పరిగణించి తుది రాతపరీక్షలో నెగెటివ్ మార్కుల విధానాన్ని తొలగించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!