తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా.. 1,000 పోస్టులు భర్తీ | 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు | TS Mega Job Mela 2024
Mega Job Mela: తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో 1000కి పైగా ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, TS SI/కానిస్టేబుల్, RPF SI/Constable” ఆన్లైన్ కోచింగ్ కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
తెలంగాణ రాష్ట్రం, రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కల్యాణలక్ష్మి ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన కంపెనీల ప్రతినిధులతో కలిసి ఉద్యోగ మేళా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ నెల 13న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కల్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్లో సుమారు 60కి పైగా కంపెనీల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశామన్నారు. ఈ మేళా ద్వారా 1000కి పైగా ఉద్యోగాలు భర్తీ కానున్నట్లు ఆయన తెలిపారు. టెన్త్, ఇంటర్, డీగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.
క్రింది లింకు పై క్లిక్ చేసి పత్రికాముఖంగా వచ్చిన నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకోగలరు