TSPSC Group 2 Notification 2022 | 783 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ -2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త . న్యూఇయర్ సందర్భంగా ప్రభుత్వం కానుకను అందించింది. 783 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులు. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 21 నుంచి 30 సంవత్సరాలు లోపు ఉన్నవారు అర్హులు.
TSPSC Group 2 పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా 18 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు.
గ్రూప్-2 పరీక్ష విధానం
గ్రూప్-2 పరీక్షలను 600 మార్కులకు నిర్వహిస్తారు. 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ నుంచి 150 మార్కులపై పరీక్ష ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. రాతపరీక్ష లో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గతంలో పరీక్షలతో పాటు ఇంటర్వ్యూ ఉండేది. దీని వల్ల నియామక ప్రక్రియ లో జాప్యం జరుగుతోందన్న భావనతో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్వ్యూ విధానం రద్దు చేసింది.
సిలబస్ వివరాలు
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.