TSPSC Group-3: గ్రూప్-3 పోస్టులు పెంచారు… త్వరలోనే పరీక్ష తేదీ
తెలంగాణ రాష్ట్రంలో ‘గ్రూప్-3’ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో మంచి శుభవార్త తెలిపింది. ‘గ్రూప్-3’ ఉద్యోగ ప్రకటనలో అదనంగా మరో 13 పోస్టులు చేర్చింది. తొలుత 1,363 పోస్టులతో ‘గ్రూప్-3’కి గత ఏడాది డిసెంబరు 30న నోటిఫికేషన్ వెలువడింది. అనంతరం బీసీ గురుకుల సొసైటీలో 12 పోస్టులు అదనంగా చేర్చారు. తాజాగా నీటిపారుదలశాఖ ఈఎన్సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు గుర్తించగా, ఆ పోస్టులను టీఎస్పీఎస్సీ గ్రూప్-3 కింద చేర్చింది. దీంతో గ్రూప్-3 మొత్తం పోస్టుల సంఖ్య 1,388కి చేరింది. కాగా గ్రూప్-3 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ త్వరలోనే ప్రకటించనుంది.
క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి పెంచిన పోస్టుల వివరాలు తెలుసుకోగలరు
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-3 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి