TSPSC Group 1 Results 2023 | తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదలకు హైకోర్టు అనుమతి
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఫలితాల వెల్లడికి హైకోర్టు అనుమతి తెలిపింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని TSPSC ని ఆదేశించింది. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రెండ్రోజుల్లోనే ఫలితాలను TSPSC రిలీజ్ చేసే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఫలితాలను విడుదల చేస్తారు. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టిఎస్పిఎస్సి ఏప్రిల్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేయగా, అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. పరీక్షలకు 2.85 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో ఒక్కో కేటగిరి నుంచి 1:50 రేషియోలో మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. అన్ని కేటగిరీల్లో కలుపుకొని 25,150 మందిని మెయిన్స్ పరీక్షకు టిఎస్పిఎస్సి ఎంపిక చేయనుంది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలు చూసుకోగలరు