TSPSC Group-1: 563 గ్రూప్-1 ఉద్యోగాల బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఆ తప్పులను వెంటనే సరిచేసుకోండి
TSPSC Group-1: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగ దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునేందుకు ఈనెల 23 నుంచి ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాల దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం 563 గ్రూప్-1 ఉద్యోగాల కోసం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో ఎవరైనా తమ దరఖాస్తులో పొరపాట్లు చేసి ఉంటే ఎడిట్ చేసుకోవడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవకాశం కల్పించింది. టీఎస్పీఎస్సీ (TSPSC) వెబ్సైట్ ద్వారా ఈనెల 23న ఉదయం 10గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్లైన్లో సవరించుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. పేరు, ఫోటో, సంతకం, పుట్టిన తేదీ, విద్యార్హత, స్టడీ సర్టిఫికెట్, NCC, స్పోర్ట్స్.. తదితర వివరాలను సవరించుకునేందుకు అవకాశం కల్పించింది. సవరించుకునేందుకు తగిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని టీఎస్పీఎస్సీ తెలిపింది .
క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి ఎడిట్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగలరు
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.