వారంలో టెట్ నోటిఫికేషన్… ఆ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు!
తెలంగాణ రాష్ట్రంలో వారం రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి, సెప్టెంబర్ నెలలో పరీక్ష నిర్వహించుటకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ను సెప్టెంబర్ లో నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్, పరీక్ష నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వారంలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి, 45 రోజుల తర్వాత సెప్టెంబర్ రెండో వారం లేదా మూడో వారంలో పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడు సార్లు టెట్ నిర్వహించారు. ఇటీవల సమావేశంలో మంత్రివర్గ ఉప సంఘం టెట్ నిర్వహణకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. టెట్ నిర్వహణపై అధికారులు సర్కారుకు నివేదిక అందించారు. దీనికి సర్కారు కూడా ఓకే అన్నట్టు తెలిసింది.
TET తర్వాత TRT
రానున్న మూడు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ రానుండటంతో కొన్ని పోస్టులతోనైనా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) వేయాలనే ఆలోచనలో సర్కారు ఉంది. దీంతో టెట్ పూర్తయిన వెంటనే నాలుగైదు వేల పోస్టులతో టీఆర్టీ నోటిఫికేషన్ వేసే అవకాశం కూడా ఉంది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి