తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రాథమిక ‘కీ’ విడుదల.. అందరికీ 4 మార్కులు కలిపారు
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ని తెలంగాణ పోలీస్ నియామక మండలి TSLPRB విడుదల చేసింది. కానిస్టేబుల్ సివిల్, కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ని www.tslprb.in వెబ్సైట్లో విడుదల చేసింది. ‘కీ’లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను మే 24 సాయంత్రం 5 గంటల లోపు తెలియజేయాలని వెల్లడించింది. అభ్యంతరాల కోసం ప్రత్యేక ప్రోఫార్మాను వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపింది. ఫైనల్ ‘కీ’ని విడుదల చేసే సమయంలో అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను సైతం విడుదల చేయనున్నట్లు పోలీస్ నియామక మండలి తెలిపింది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి TSLPRB విడుదల చేసిన ప్రియమనరీ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి
Constable Civil/ Excise/Transport
Constable IT & CO/ Mechanic/ Driver
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి