TS Inter Results 2024 | తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల?
TS Inter Results 2024: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు వచ్చే వారంలో విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 22 (సోమవారం) లేదా 23వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పేపర్ల మూల్యాంకనంతో పాటు నమోదైన మార్కుల పరిశీలన పూర్తయింది. ఈ నేపథ్యంలో ఫలితాలను త్వరగానే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 4 విడతల్లో మూల్యాంకన ప్రక్రియను నిర్వహించి ఏప్రిల్ 10వ తేదీన పూర్తి చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకేసారి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. ఫలితాలు విడుదల చేసిన తర్వాత విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు.