TS DSC 2023 | డిసెంబర్ రెండో వారంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణ
TS DSC 2023: తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షను డిసెంబర్ రెండో వారంలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈసారి పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు.
TS DSC 2023: తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షను డిసెంబర్ నెలలో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం డిసెంబర్ రెండో వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. మొత్తం 6,612 టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు, షెడ్యూల్ తో కూడిన జీవో రెండు, మూడు రోజుల్లో విడుదల కానున్నది. ఆ వెంటనే పాఠశాల విద్యాశాఖ అధికారులు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
గతంలో మాదిరిగా పరీక్షలను ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు. పరీక్ష తేదీలను ఖరారుచేసే పనిలో అధికారులు ఉన్నారు. అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్య ఆధారంగా షిఫ్టులవారీగా పరీక్షలను నిర్వహిస్తారు. దాదాపుగా హైదరాబాద్ చుట్టుపక్కలే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. జిల్లా కేంద్రాల్లోనూ పరీక్షలను కేటాయించేలా చర్యలు చేపడుతున్నారు. ఇక ప్రశ్నపత్రాల రూపకల్పన బాధ్యతలను రాష్ట్ర విద్యాశాఖ శిక్షణ పరిశోధనా సంస్థ (ఎస్సీఈఆర్టీకి అప్పగిస్తారు. ఎస్జీటీలకు ఒక రోజు, స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టులకు రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి