ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & LDC పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మరొక మంచి శుభవార్త చెప్పింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) ఎగ్జామినేషన్ 2023 సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 1,600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. టైర్-1, టైర్-2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 1,600
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులను భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు:
ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 ఆగస్టు 1వ తారీఖు నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.19,900/- నుంచి రూ.92,300/- వరకు
దరఖాస్తు ఫీజు/ పరీక్ష ఫీజు:
రూ.100/- ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
(ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక విధానం:
టైర్-1, టైర్-2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
టైర్-1 పరీక్షను ఆగస్టు నెలలో నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.
తెలంగాణ అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2023 మే 9వ తారీకు నుంచి 2023 జూన్ 8వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి