APPSC Group-2: 900 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్.. సీఎం గ్రీన్ సిగ్నల్
APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్-2 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. గ్రూప్-2 నోటిషికేషన్ విడుదలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. దాదాపు 900 లకు పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
గురువారం ఉదయం ఈ పోస్టుల భర్తీపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు.
గ్రూప్-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీచేయాలని సీఎం ఆదేశించారని. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు. అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుందని పేర్కొన్నారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఏపీపీఎస్సీ గ్రూప్-2 సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
APPSC గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తీ కోర్సుని ‘Telugu Vidyarthi’ యాప్ ద్వారా పేద విద్యార్థుల కోసం అతి తక్కువ ధరకే అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి.