APPSC Group 2: వెయ్యికి పైగా పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే వెయ్యికి పైగా గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగే సుధీర్ ఏప్రిల్ 3న ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రాబోయే మూడు నెలల్లో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందులో ముఖ్యంగా గ్రూప్-2 కు సంబంధించి వెయ్యికి పైగా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
సమగ్రత కోసమే గ్రూప్-2 సిలబస్ లో మార్పులు తెచ్చామని తెలిపారు. ప్రిలిమ్స్ పరీక్షలో కొత్తగా ఇండియన్ సొసైటీ అనే కొత్త సిలబస్ ను తీసుకొచ్చామని తెలిపారు. భారత సమాజం ఎలా ఉందని, కులాలేంటి, మతాలేంటి, వాటి వల్ల వచ్చే సమస్యలేంటి, వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలు ఏంటనేది ఈ సబ్జెక్టులో ఉంటుందని, ఈ అంశాలపై అవగాహన గ్రూప్-2 అధికారికి చాలా అవసరమని అందుకే సిలబస్ లో మార్పులు చేశామని చెప్పారు. సిలబస్ ఏంటనేది స్పష్టంగా పేర్కొన్నామని దీంతో ఏ అభ్యర్థి అయినా ఎటువంటి కోచింగ్ సెంటర్ కు వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాయవచ్చని అన్నారు. ప్రశ్నపత్రాన్ని సెట్ చేసేటప్పుడు సిలబస్ ను దాటిపోకుండా, ట్రాన్స్లేషన్ తప్పులు లేకుం,డా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చాలా పగడ్బందీగా పేపర్ను సెట్ చేస్తున్నట్లు సుధీర్ తెలిపారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 సిలబస్ డౌన్లోడ్ చేసుకోగలరు
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి