October 8, 2024
AP Govt Jobs

APPSC: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. సమీపిస్తున్న గడువు

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు మరో మూడురోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 52 శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను 2024 ఫిబ్రవరి 25వ తారీకున నిర్వహించనుంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు మరో 3 రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 10వ తారీకు లోపు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.

Notification Link

Group-2 Syllabus

Official Website

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!