AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో సాగర్ మిత్ర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాతపరీక్ష లేదు, ఫీజు లేదు
AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో సాగర మిత్ర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కృష్ణాజిల్లా నందు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కాంట్రాక్టు ప్రాతిపదికన సాగర మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా కృష్ణా జిల్లాలో గల ఫిష్ లాండింగ్ సెంటర్స్ అయిన ఏటిపొగరు, చిన్న గొల్లపాలెం, ఏటిమొగ, సొర్లగొంది, ఎదురుమొండి, జింకపాలెం, ఈలచెట్లదిబ్బ, పల్లెతుమ్మలపాలెం లలో 8 “సాగరమిత్ర” పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు B.F.Sc, మరియు B.Sc (ఫిషరీస్/మెరైన్ బయాలజీ/ జువాలజీ) డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
సాగర మిత్ర: 08 పోస్టులు
విద్యార్హతలు:
B.F.Sc లేదా B.Sc (ఫిషరీస్ సైన్స్/ మెరైన్ బయాలజీ/జువాలజీ) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
నెలకు రూ.15,000/- జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు,
మచిలీపట్నం, కృష్ణా జిల్లా.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 నవంబర్ 22వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
అతి తక్కువ ధరలో AP గ్రూప్-2, గ్రామ సచివాలయం ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి