AP District Court Jobs: జిల్లా కోర్టులో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కోర్టులో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కోర్టులో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతిలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను అవుట్సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి అధికారిణి పద్మజ ఓ ప్రకటనలో తెలిపారు. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్-4, జూనియర్ అసిస్టెంట్-1, డేటా ఎంట్రీ ఆపరేటర్-1, స్టెనో-1, రికార్డ్ అసిస్టెంట్-2, అటెండర్-7, ఆఫీస్ సబార్డినేట్-1 పోస్టు చొప్పున ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు చిత్తూరులోని ఉపాధి కార్యాలయంలో దరఖాస్తులు పొంది, ఈనెల 22వ తేదీలోపు కార్యాలయంలో అందజేయాలని చెప్పారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోగలరు
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి